Sleeping After Bath: రాత్రిపూట స్నానం మంచిదే.. కానీ, ఇది చాలా డేంజర్.. మొత్తం బాడీపై ఎఫెక్ట్

Sleeping After Bath: కొంతమంది రాత్రిపూట స్నానం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదట. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Sleeping After Bath: రాత్రిపూట స్నానం మంచిదే.. కానీ, ఇది చాలా డేంజర్.. మొత్తం బాడీపై ఎఫెక్ట్

Disadvantages of Sleeping after bath

Updated On : June 27, 2025 / 3:14 PM IST

మనలో చాలా మందికి రాత్రిపుట స్నానం చేసే అలవాటు ఉంటుంది. నిజానికి ఇది చాలా మంది అలవాటు. రోజంతా ఎదో ఒక పనులు చేస్తూ అలసిపోయిన శరీరాన్నీ శుభ్రపరుచుకోవడం వల్ల మైండ్ రిలీఫ్ అవుతుంది. ప్రశాంతత లభిస్తుంది. అందుకే, ఇది మంచి అలవాటుగా చెప్తారు డాక్టర్స్ కూడా. అయితే, రాత్రిపూట స్నానం తరువాత చాలా మంది చేసే పని మాత్రం ప్రమాదం అని చెప్తున్నారు. ఆ అలవాటు ఏంటంటే.. నిద్రపోవడం. అవును కొంతమంది రాత్రిపూట స్నానం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదట. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణుల ప్రకారం స్నానం తరువాత బాడీకి కాస్త రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే.. మన స్నానం వల్ల చల్లబడిన లేదా వెచ్చబడిన శరీరం గది ఉష్ణోగ్రతకు అలవాటు పడేందుకు సమయం పడుతుంది. కాబట్టి, స్నానం చేసిన వెంటనే పడుకుంటే పడుకుంటే అది ఇమ్యూనిటీ పవర్‌ ను తగ్గిస్తుంది. దానివల్ల విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తడిసిన బాడీతో డైరెక్ట్ గా నిద్రపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్‌ వీక్‌ అయ్యి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.

పడుకోవడానికి ముందు స్నానం చేస్తే శరీరంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో కండరాలు పట్టేసినట్లుగా అనిపిస్తుంది. కొంతమంది స్నానం చేసి బయటకు రాగానే ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్‌లో పడుకుంటారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. ఇది మరింత ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కావచ్చు. కాబట్టి, శరీర ఉష్ణోగ్రతను సాధారణంగానే సెట్ అయ్యేలా చూసుకోవాలి. తడి జుట్టుతో, తడి చర్మంతో పడుకోవడం వల్ల బాడీ పెయిన్స్‌, మెడ నొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు:

  • రాత్రిపూట స్నానం చేయాలనుకుంటే నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందు చేయాలి.
  • స్నానం తర్వాత తలను హెయిర్ డ్రైయర్‌తో పూర్తిగా ఆరబెట్టుకోవడం మంచిది.
  • కొద్దిసేపు గాలికి తలను ఆరనివ్వాలి.
  • స్నానం తరువాత బాడీకి మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మం పొడిబారదు.
  • చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
  • వేసవిలో సాధారణ నీటితో స్నానం చేయండి.