లోకల్ ట్రాన్స్ మిషన్ దశలో ఉన్నాం…కరోనాపై కేంద్రం క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 30, 2020 / 11:00 AM IST
లోకల్ ట్రాన్స్ మిషన్ దశలో ఉన్నాం…కరోనాపై కేంద్రం క్లారిటీ

Updated On : March 30, 2020 / 11:00 AM IST

భారత్ లో కూడా కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్(ఒకరి నుంచి మరొకరికి సోకడం)తక్కువ పరిధిలో ప్రారంభమైందని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ డాక్యుమెంట్ చెబుతోంది. దేశం మొదటిసారిగా సంక్రమణ చెందుతున్న దశలోకి ప్రవేశిస్తోందని ఆరోగ్యశాఖ అంగీకరించింది. అయితే రోగి సంక్రమణ యొక్క మూలాన్ని గుర్తించలేము మరియు ఐసొలేట్ చేయలేమని తెలిపింది. ఆదివారం అర్థరాత్రి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) ను వివరించే ఓ డాక్యుమెంట్ ఈ విధంగా తెలిపింది. SOP భారతదేశంలో ప్రస్తుత దశ కోవిడ్ -19 మహమ్మారికి వర్తిస్తుంది(లోకల్ ట్రాన్స్ మిషన్ అండ్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) ఇందులో ఫ్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం…అన్ని అనుమానిత కేసులను ఐసొలేషన్ సౌకర్యాల వద్ద అడ్మిట్ అయి ఉన్నాయి.

ఈ కరోనా మహమ్మారి వ్యాప్తికి నాలుగు ముఖ్య దశలు ఉంటాయి. స్టేజ్-1 ఏంటంటే…కేసులు బయట నుంచి వచ్చినవి,స్థానికంగా వచ్చిన కేసులు కాదు. స్టేజ్-2 ఏంటంటే లోకల్ ట్రాన్స్ మిషన్…అంటే వైరస్ పాజిటివ్ తేలిన ఓ సెక్షన్ వ్యక్తులు…ట్రావెల్ హిస్టరీ(విదేశాలు లేదా వైరస్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారావడం)ఉన్న కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ తో సంబంధం కలిగి ఉండటం. స్టేజ్-3ఏంటంటే… కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్. స్టేజ్-4 ఏంటంటే.. ఒక అంటువ్యాధి.

సంక్రమణ మూలం గుర్తించబడనప్పుడు మరియు రోగికి ప్రయాణ చరిత్ర లేనప్పుడు లేదా ధృవీకరించబడిన కరోనా సోకిన వ్యక్తితో తెలిసిన పరిచయం లేనప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగుతుంది. నిర్ధారణ చేయని కేసులు ఇతరులకు సోకుతున్నాయని ఇది సూచిస్తుంది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని వివిధ లొకేషన్లలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరిగిందని,కానీ కానీ ఇప్పుడు గుర్తించలేని సంక్రమణ ఉన్నవారి సంఖ్య పెరుగుతోందని,ఇది కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైనదని చెప్పడానికి ఓ సంకేతమని ఓ సీనియర్ ప్రజారోగ్య నిపుణుడు తెలిపారు.

భారత్ లో సోమవారం(మార్చి-30,2020)ఉదయం వరకు 1071కరోనా కేసులు 29మరణాలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి నుంచిొ సోమవారం ఉదయం లోపే 50 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. ఇక కరోనా మరణాల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఇప్పటివరకు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 9కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే వైరస్ సోకినవారు అని తెలియక కలిసిన,లేదా ట్రవెల్ హిస్టరీ తెలియక కలిసిన వారికి వైరస్ సోకిన కేసులు గత వారం రోజులుగా పెరుగుతున్నప్పటికీ భారతదేశం ఇంకా రెండోవదశలోనే ఉందంటూ బహిరంగంగా  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)చెబుతోంది.

అయితే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై తాను ఇప్పుడు ఎలాంటి కామెంట్ చేయలేనని ICMR ఎపిడిమియాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ హెడ్ రామన్ గంగాఖేదర్ తెలిపారు, ఫిబ్రవరి మధ్యలోనే భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ప్రారంభమైందని తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూర్ లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోని క్లినికల్ వైరాలజీ అండ్ మైక్రోబయాలజీడిపార్ట్మెంట్ హెడ్ జాకోబ్ జాన్ తెలిపారు. అమెరికాలో కూడా కాలిఫోర్నాయాలో నమోదైన మెదటి కరోనా వైరస్ పేషెంట్ కు ఎటువంటి సంబంధిత ప్రయాణ చరిత్ర లేదని లేదా తెలిసిన మరొక రోగికి బహిర్గతం చేయకుండా ఉండటం యునైటెడ్ స్టేట్స్ లో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తికి ఉదాహరణ అని యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (యుఎస్‌సిడిసి) ఇప్పటికే ప్రకటించింది.

అయితే మనం ఇంకా లోకల్ ట్రాన్స్ మిషన్ స్టేజీలోనే ఉన్నామని ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ సోమవారం(మార్చి-30,2020) తెలిపారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ స్థానిక ప్రసారం మరియు పరిమిత సమాజ ప్రసార దశలో” ఉందని చెప్పిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ డాక్యుమెంట్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ఎక్కడా మేము దీనిని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని పిలువడం లేదు. మనం ఇంకా లోకల్ ట్రాన్స్ మిషన్ (స్థానిక ప్రసార దశ)లో ఉన్నాము. మనం ‘కమ్యూనిటీ’ అనే పదాన్ని ఉపయోగిస్తే  అది ఊహాగానాలే అవుతాయి అని లావ్ అగర్వాల్ అన్నారు. గడిచిన 24గంట్లో భారత్ లో 92కొత్త కేసులు,4మరణాలు నమోదయ్యాయని ఆయన తెలిపారు.