కరోనా మహమ్మారి ఒత్తిడిని తట్టుకోనేందుకు చాలామంది మహిళలు మద్యానికి అలవాటయ్యారు!

  • Published By: sreehari ,Published On : October 1, 2020 / 10:01 PM IST
కరోనా మహమ్మారి ఒత్తిడిని తట్టుకోనేందుకు చాలామంది మహిళలు మద్యానికి అలవాటయ్యారు!

Updated On : October 2, 2020 / 6:13 PM IST

pandemic stress women alcohol : ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఆరోగ్యపరంగానే కాదు.. మానసికంగానూ మహమ్మారి తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. కరోనా ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలామంది మద్యానికి బానిసలయ్యారంట. అందులోనూ ప్రత్యేకించి మహిళలే ఎక్కువగా మద్యానికి (alcohol consumption) బాగా అలవాటుపడ్డారంట.. కరోనా ఒత్తిడిని తట్టుకునేందుకు చాలామంది మహిళలు మద్యం వైపు మొగ్గు చూపారని ఓ రిపోర్టు వెల్లడించింది.

మహిళల్లో ఒత్తిడికి కారణాలేంటి? :
కరోనా లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం, ఒంటరితనం, ఉద్యోగంలో అభద్రతాభావం, ఇంటిఖర్చులు పెరగడం, పిల్లల పోషణ భారం కావడం వంటి అనేక కారణాలతో మహిళల్లో ఒత్తిడికి కారణమై ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ ఒత్తిడి కారణంగానే చాలామంది మహిళలు మద్యంవైపు మొగ్గు చూపారనడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.

pandemic stress women alcohol: To cope with pandemic stress, many women turned to alcohol, continuing a worrying trend

ఈ ఏడాదిలో మార్చి, ఏప్రిల్ నెలలోనే మద్యపాన సమస్యాత్మకంగా మారిందని సౌత్ ఫ్లోరిడాలోని University of South Florida లోని సైకాలిజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ Lindsey Rodriguez చెప్పారు. అధికంగా మద్యం సేవించడం కారణంగా ఆల్కహాల్ పాయిజనింగ్, లివర్ సిర్రోసిస్, గుండె జబ్బులు, అనేక ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్లతో సహా ఆరోగ్యకరమైన ప్రభావాలకు దారితీసింది.

43శాతం పెరిగిన మద్యం సంబంధిత మరణాలు :
వాస్తవానికి.. అమెరికాలో ఆల్కాహాల్ సంబంధిత మరణాలు పెరిగాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (CDCP) ఒక నివేదికను ప్రచురించింది. 2006 నుంచి 2018 మధ్య కాలంలో ఆల్కాహాల్ సంబంధిత (alcohol-related mortality) మరణాలు 43శాతం మేర పెరిగాయని CDC నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటాస్టిక్స్ గుర్తించినట్టు నివేదిక పేర్కొంది.

ఇందులో ఈ ఏడాది నుంచి డేటాను చేర్చలేదు.. కానీ, ఇతర పరిశోధనల్లో అమెరికాలో చాలా మందిలో ముఖ్యంగా మహిళలలో మద్యపానం ఎలా సమస్యగా మారిపోయిందో ఈ పరిశోధనలో హైలెట్ చేసింది.

pandemic stress women alcohol: To cope with pandemic stress, many women turned to alcohol, continuing a worrying trend

ఇటీవలి కాలంలో ఆల్కాహాల్ సంబంధిత మరణాల రేటు ఎక్కువగా పెరిగాయి.. 2018 నాటికి పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా మరణాల రేటు పెరిగిందని నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా మరణాల రేటు 18 శాతం పురుషుల్లో ఉండగా.. మహిళల్లో 23 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. ఆల్కాహాల్ సంబంధిత మరణాలు పెరగడానికి వెనుక కారణాలను అధ్యయనం వెల్లడించలేదు.

మహిళ్లలోనే అధిక మరణాల రేటు :
కరోనా ప్రభావం ఎక్కువగా మహిళలపైనే ఉందని గుర్తించినట్టు CDC రిపోర్టు తెలిపింది. ప్రతి ఏడాదిలో మహిళల కంటే పురుషుల్లోనే అత్యధిక రేటు ఉండేదని అధ్యయన నిపుణులు పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు మహిళల్లోనే అధిక మరణాల రేటు పెరిగిందని తెలిపారు.

మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా పెరిగిందో ఎలాంటి కారణాలను రిపోర్టులో వెల్లడించలేదు. కానీ, నగర శివారుల్లో నివసించడం కారణంగానే అక్కడి మహిళల్లో మరింత ముప్పును పెంచిందని పేర్కొంది. 2000 నుంచి 2018 వరకు పురుషులు, మహిళల్లో మొత్తంమీద పట్ణణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతానికి పెరిగిందని అధ్యయన నిపుణులు వెల్లడించారు.