Sinusitis: వర్షాకాలంలో సైనసైటిస్ సమస్య.. శ్వాసలో ఇబ్బంది, ముఖంపై వాపు.. నిర్లక్ష్యం వద్దు
సైనసైటిస్ సమస్య ఉన్నవారికి అలర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు దుమ్ము ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.

Sinusitis problems
సైనసైటిస్.. ఈ మధ్య కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య చాలా పెరుగుతోంది. ఈ సమస్యఠీ ఇబ్బందిపడే వారి అవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వారి బాధ నరకమే అని చెప్పాలి. ముఖ భాగంలో కళ్ళు, ముక్కు కలిసే చోట ఎముకల్లో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఆ భాగంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని “సైనసైటిస్”గా అంటారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో ఈ సమస్య వస్తోంది. ఈ సమస్య వచ్చిన వారికి నిరంతర జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, కనుబొమ్మలు జివ్వుమని లాగడం వంటి లక్షణాలు ఉంటాయి.
రానున్నది వర్షాకాలం కాబట్టి ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ సైనసైటిస్ సమస్య చాలా మందిలో దీర్ఘకాలం ఉండవచ్చు. కొంత మందికి కొన్ని నెలల్లో లేదా కొన్నేళ్లలో తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే.. ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో చేసుకొనే మార్పుల వల్ల సైనసైటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి మార్పులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
- సైనసైటిస్ సమస్య ఉన్నవారికి అలర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారు దుమ్ము ధూళి, పొగ, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ వెళ్లినా కూడా ముక్కుకు మాస్క్ లాంటిది వాడితే మంచిది.
- ముక్కును, నోటిని తరచుగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు చల్లని నీటికంటే గోరువెచ్చని నీటిని తాగడం మంచిది.
- ఉదయం, సాయంత్రం వేడి నీటితో ఆవిరి పట్టుకోవాలి. ఆ నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు, యాటిబయోటిక్ గా పనిచేసే పసుపు వేసుకోవడం వల్ల వల్ల సైనసైటిస్ సమస్య తీవ్రం అవకుండా చేసుకోవచ్చు.
- ఈ సమస్య ఉన్నవారు. ఏసీ, ఫ్యాన్ గాలులకు దూరంగా ఉండాలి. ఫ్యాన్ కింద పడుకోవడం మంచిది కాదు.
- కూల్ డ్రింక్స్, పుల్లటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. పుల్లటిపదార్థాల్లో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అది సైనసైటిన్ సమస్యను ఎక్కువ చేసే అవకాశం ఉంది.
- సైనసైటిస్ సమస్య ఉన్నవారు ధూమపానానికి, మధ్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. పొగ త్రాగడం వల్ల సైనస్ లో ఇన్ఫెక్షన్ తీవ్రమయ్యే అవకాశం ఉంది.
- ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను అధికంగా తీసుకోవాలి. మంచి నిద్ర కూడా చాలా అవసరం. ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల సైనసైటిస్ సమస్యను నయం చేసుకునే అవకాశం ఉంది. అది కూడా ఎలాంటి డాక్టర్ వద్దకు వెళ్లకుండా. అందుకే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.