Oats: ఓట్స్ అధికంగా తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు అవసరమే
ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, శుల్లులు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.

Oats side effcts
ఈ మధ్య కాలంలో చాలా మంది ఓట్స్ ని ఎక్కువగా తింటున్నారు. దానికి కారణమూ లేకపోలేదు. దీనివల్ల అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ఓట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఓట్స్ తినడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో. ఎక్కువగా తింటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందట. ఓట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో, మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారికి ఓట్స్ ఒక వరం అనే చెప్పాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తాగడంలో చాలా సహాయపడుతుంది. ఇక రక్తంలో చెక్కర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. ఆ విధంగా షుగర్ కంట్రోల్ చేయడంలో ఓట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. అయితే.. ఓట్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, శుల్లులు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరానికి మేలు చేస్తుంది కానీ, అధిక మొత్తంలో తీసుకుంటే జీర్ణశక్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇంకా ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని క్యాల్షియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటుంది. ఖనిజ లోపాలు తలెత్తే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య తలెత్తే అవకాశం ఉంది. కొందరికి ఓట్స్ తినడం వల్ల అలెర్జీలు కూడా రావొచ్చు. చర్మంపై దద్దుర్లు, శ్వాస సంబంధమైన సమస్యలు, రియాక్షన్లకు దారితీయవచ్చు.
ఓట్స్ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. చాలా మంది ఓట్స్ ని ఉదయం పోత బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఓట్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, శరీరానికి అనవసరమైన పోషకాలు అంది బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా మంది రుచి కోసం ఓట్స్ లో చక్కర, తేనే లాంటి తీపి పదార్థాలను వాడుతారు. వాటివల్ల సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఓట్స్ ను అధికంగా తీసుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది.