Shoes without Socks: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? అయితే సమస్య మొదలైనట్టే.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి
సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది.

Shoes without Socks
నేటి కాలం యువత ఫ్యాషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్టైల్ గా కనిపించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకటి షూస్ ధరించడం. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతి ఒకరు షూస్ వాడుతున్నారు. అయితే, షూస్ వాడటం వరకు ఒకే కానీ, సాక్స్ ధరించడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు. ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది సాక్స్ వేసుకోకుండానే షూస్ ధరిస్తున్నారు. దానికి అనేకరణాల కారణాలు ఉన్నాయి. ఉతకడం బద్ధకం కావచ్చు, లేదా వేసుకుంటే వాసన వస్తాయనో తెలియదు కానీ, చాలా మంది అదే ఫాలో అవుతున్నారు. నిజానికి సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయట. మరి ఆ సమస్యలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది. పాదాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. కొంతమందికి సున్నితమైన శరీరం ఉంటుంది. అలాంటివారు సాక్స్ లేకుండా షూస్ ధరించడం వల్ల ఎలర్జీ, దురద సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఒక నివేదిక ప్రకారం ఒక వ్యక్తి పాదాలు రోజుకి 300 మీ.లీ. చెమటను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి సాక్స్ లేకుండా షూస్ వేసుకోవడం వల్ల చమట పేరుకుపోయి బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
షూస్, సాక్స్ ధరించడంలో ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి:
నాణ్యమైన షూస్ నే ఎల్లప్పుడూ వాడాలి.
కాలుకి సరిగా సెట్ అయ్యే షూస్ మాత్రమే ధరించాలి. సైజు ఎక్కువగాను తక్కువగాను ఉండకూడదు.
సాక్స్ కూడా నాణ్యమైనవి వాడాలి.
ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. లేదంటే పైన చెప్పినట్టుగా అనేకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.