రోచె ఆర్థరైటిస్ డ్రగ్‌తో కరోనా మరణాలు తగ్గాయి : ట్రయల్‌లో రుజువైంది!

రోచె ఆర్థరైటిస్ డ్రగ్‌తో కరోనా మరణాలు తగ్గాయి : ట్రయల్‌లో రుజువైంది!

Updated On : February 12, 2021 / 10:23 AM IST

Roche arthritis drug reduces COVID-19 deaths : కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులను రోచె ఆర్థరైటిస్ మందుతో కోలుకునేలా చేయొచ్చునని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. tocilizumab అనే రోచె ఆర్థరైటిస్ మందును తీసుకున్న కరోనా బాధితుల్లో మరణ ముప్పును తగ్గించిందని తేలింది. కరోనాతో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వారిపై పెద్ద స్థాయిలో ట్రయల్స్ నిర్వహించారు రీసెర్చర్లు. ఈ ట్రయల్స్ ఫలితాల్లో చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మందు తీసుకున్నవారిలో వెంటిలేటర్ అవసరాన్ని కూడా తగ్గించిందని అధ్యయనంలో రుజువైంది.

మార్చి 2020 నుంచి కరోనా చికిత్స సంబంధించి అనేక రికవరీ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోచె ఆర్థరైటిస్ డ్రగ్ tocilizumab కరోనా బాధితులపై పనిచేస్తుందా? లేదా అనే కన్ఫూజన్ ట్రయల్ ఫలితాలతో స్పష్టమైపోయింది. అలాగే ఈ డ్రగ్ కరోనా బాధితులందరికి అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆక్సిజన్ తక్కువ స్థాయిలు, మంట వంటి లక్షణాల నుంచి తగ్గించిందని ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ పీటర్ హర్బై పేర్కొన్నారు.

గత ఏడాది జూన్ లో నిర్వహించిన రికవరీ ట్రయల్ లో చౌకైన స్టిరాయిడ్ dexamethasone వాడగా.. మూడుంతల మంది కరోనా బాధితుల్లో మరణాలను తగ్గించింది. Tocilizumab అనే డ్రగ్.. Actemra బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతోంది. తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్స కోసం ఈ డ్రగ్ వినియోగిస్తుంటారు. ఏప్రిల్ 2020లో ఆక్సిజన్ అవసరమైన 2,022 మంది కరోనా బాధితులకు మొదటిసారి Tocilizumab డ్రగ్ అందించారు. ఈ ట్రయల్ ఫలితాల్లో ఆర్థరైటిస్ డ్రగ్ కేవలం 28 రోజుల్లో 596 మందిలో (29శాతం) కరోనా మరణాలను తగ్గించిందని కనుగొన్నారు.