Sleep: ఈ భంగిమలో పడుకుంటే ఫుల్లు నిద్ర.. బాడీకి ఫుల్ రెస్ట్.. ఒకసారి ట్రై చేయండి

దుప్పటినుండి రెండు కాళ్ళు బయటకు పెట్టి పడుకోవడం వల్ల చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుందట.

Sleep: ఈ భంగిమలో పడుకుంటే ఫుల్లు నిద్ర.. బాడీకి ఫుల్ రెస్ట్.. ఒకసారి ట్రై చేయండి

Sleep problems

Updated On : June 10, 2025 / 9:31 AM IST

నిద్ర.. మానవ శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే.. శరీరానికి కావాల్సిన విశ్రాంతి నిద్రలోనే దొరుకుతుంది. ఎంత బాగా నిద్రపోతే ఆరోగ్యం అంత బాగుంటుంది. కానీ, ప్రస్తుత సమాజంలో చాలా మంది నిద్రకు దూరం అవుతున్నారు. సామాజిక, ఆర్థిక, పని ఇలా చాలా రకాల ఒత్తిడిల కారణంగా నిద్ర దూరం అవుతుంది. అలాంటి వారికి ఈ న్యూస్ కాస్త ఊరట అనే చెప్పాలి. అదేంటంటే.. మనలో ఒక్కొక్కరికి ఒక్కోలా పడుకునే అలవాటు ఉంటుంది. కానీ, ఒక ప్రత్యేకమైన భంగిమలో పడుకోవడం వల్ల చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుందట. అంతేకాదు.. ఆ భంగిమలో పడుకోవడం వల్ల చాల రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. నిపుణులు ఈ విషయాన్నీ బల్లగుద్ది చెప్తున్నారు. మరి ఆ నిద్ర భంగిమ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చాలా మందికి దుప్పటికప్పుకొని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఆ సమయంలో అనుకోకండానే దుప్పటి నుండి రెండు కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. కొంతమంది మాత్రం కావాలని అలా రెండు కాళ్ళు బయటకు పెట్టి పడుకుంటారు. నిజానికి అలా దుప్పటినుండి రెండు కాళ్ళు బయటకు పెట్టి పడుకోవడం వల్ల చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుందట. వింతగా ఉంది కదా. దానికి కారణమూ లేకపోలేదు. జోర్నల్ అఫ్ ఫిజియలాజికల్ యాంత్రోపాలజీ 2023లో ప్రచురించిన అధ్యాయనం ప్రకారం దుప్పటినుండి రెండు కాళ్ళు బయటపెట్టి పడుకోవడం వల్ల శరీరం వేడిని వేగంగా వదిలించుకోవడానికి వీలుగా ఉంటుందట.

మన అరికాళ్లలో ప్రత్యేకమైన రక్తనాళాలు ఉంటాయి. అవి శరీరం నుండి వేడిని బయటకు పంపిస్తాయి. దుప్పటికప్పుకొని పడుకోవడం వల్ల శరీరంలో వేడి నెమ్మదిగా బయటకు వెళ్తుంది. కానీ, ఇలా రెండు కాళ్ళు బయటకు పెట్టి పడుకోవడం వల్ల వేడి బయటకు తొందరగా వెళిపోతుందట. పాదాలకు చల్లటి గాలి తాకి శరీర
ఉష్ణోగ్రత తగ్గుతుందట. దానివల్ల ప్రశాంతమైన నిద్రకు అవసరమైన మెలటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుందట. దాంతో చాలా తొందరగా గాఢ నిద్రలోకి వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. శరీరం చల్లగా మారడం వల్ల జీవక్రియలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా నిద్ర లేమితో బాధపడుతున్నారా. అయితే వేంటనే పైన చెప్పిన విధంగా ట్రై చేయండి.