Kidney Problem: మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉందా.. అయితే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నట్టే
కిడ్నీ సమస్య ఉంటే శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి చర్మ సమస్యలు ఏర్పడతాయి. ర్మం పొడిబారడం, పొలుసులా మారడం, దురద వంటి సమస్యలు కనిపిస్తాయి.

kidney problem in momen
కిడ్నీ(మూత్రపిండాలు) మనిషి శరీరంలో ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్షాన్ని శుద్ధి చేస్తాయి. అలాగే ఫ్లూయిడ్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేయడంతొపాటి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ, చాలా కారణాల వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఈ సమస్య వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. కాబట్టి.. కిడ్నీల ఆరోగ్యం అనేది చాలా అవసరం. అయితే కిడ్నీ సమస్య మొదలయ్యే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ, మహిళల్లో మాత్రం లక్షణాలు పెద్దగా కనిపించవు. ఒకవేళ కనిపించినా వేరే సమస్య అనుకోని వదిలేస్తూ ఉంటారు. మరి మహిళల్లో కిడ్నీ సమస్య వల్ల వచ్చే లక్షణాలను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చెప్పినట్టుగా కిడ్నీ సమస్య ఉంటే శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయి చర్మ సమస్యలు ఏర్పడతాయి. ర్మం పొడిబారడం, పొలుసులా మారడం, దురద వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి. కారణం ఏంటంటే.. హార్మోనల్ ఛేంజెస్ చర్మ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. చర్మం అసాధారణంగా అనిపిస్తే కిడ్నీ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
కిడ్నీలు శరీరంలోని కాల్షియం, సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒకవేళ అవి సరిగా పనిచేయకపోతే బాడీలో ఎలక్ట్రోలైట్ ఇమ్‌బ్యాలెన్స్ ఏర్పడి కండరాల నొప్పులు, తిమ్మిరి సమస్యలు వస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు ఈ లక్షణాన్ని స్త్రీలలో మరింత తీవ్రం చేస్తాయి. ఈ సమస్యలు ఎక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవండి.
కిడ్నీ సమస్య ఉన్న స్త్రీలలో మూత్రం నురగగా, కాస్త ఎరుపు లేదా ముదురు రంగులో కనిపిస్తుంది. రాత్రిపూట తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్ర విసర్జన సమయంలో మంట రావడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు కారణం. స్త్రీలలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రతరం కావచ్చు.
కిడ్నీలు రెడ్ బ్లడ్ సెల్స్ తయారీకి అవసరమయ్యే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కిడ్నీ సమస్య వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గి అనీమియా సమస్య వస్తుంది. ఆ కారణంగా శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి, అలసట, బలహీనత ఏర్పడుతుంది. కాళ్లు, చీలమండలు, ముఖం, కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. ఉదయం పూట ఈ ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తే మీ కిడ్నీలు డేంజర్ లో ఉన్నట్టే. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.