తెలంగాణలో కరోనా తగ్గుముఖం : GHMC లో రెండు కేసులు..మొత్తం @ 1003 కేసులు

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 04:53 AM IST
తెలంగాణలో కరోనా తగ్గుముఖం : GHMC లో రెండు కేసులు..మొత్తం @ 1003 కేసులు

Updated On : April 29, 2020 / 4:53 AM IST

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందా ? సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయా ? త్వరలోనే ఫ్రీ కరోనాగా రాష్ట్రం మారుతుందా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అవుననే విషయం అర్థమౌతోంది. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. 2020, ఏప్రిల్ 27 సోమవారం సాయంత్రం వరకు రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ కేసులు GHMC పరిధిలో నమోదయ్యాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా 1003కు కేసులు చేరాయి. సోమవారం 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. 646 మందికి చికిత్స కొనసాగుతోంది. 

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ తెలంగాణను భయపెడుతోంది. కేంద్ర ప్రభుత్వం రెండోసారి లాక్ డౌన్ ( మే 03) కొనసాగించిన సంగతి తెలిసిందే. కానీ సీఎం కేసీఆర్ ముందస్తు చర్యలో భాగంగా మే 07వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎలాంటి సడలింపులు ఉండవని, ఇప్పుడు సహకరించినట్లే మే 07వ తేదీ వరకు సహకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అనూహ్యంగా GHMC పరిధిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం అందరిలో ఆందోళన కలిగించింది. ఎక్కడైతే కేసులు అధికం అవుతున్నాయో ఆ ప్రాంతాన్ని క్వారంటైన్ గా ప్రకటించారు. బయటి వారిని లోనికి..లోపల ఉన్న వారిని అనుమతించలేదు. వీరికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతరత్రా వాటిని ప్రభుత్వమే అందిస్తూ వచ్చిది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతుండడం శుభపరిణామమని, ఇదే కొనసాగాలని కోరుకుంటున్నారు.