విటమిన్ ‘D’ కోసం ఈ 6 రకాల ఫుడ్ తినండి.. కరోనా రాకుండా అడ్డుకోవచ్చు!

Vitamin D Sufficiency : విటమిన్ ‘డి’.. సహజంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. దీన్ని ‘sunshine vitamin’ అని కూడా అంటారు. శరీరానికి విటమిన్ డి అవసరం ఎంతో ఉంది. శరీరంలో కాల్షియాన్ని అందిస్తుంది. తద్వారా ఎముకలు బలంగా తయారువుతాయి. కండరాలు, పండ్లు, గోర్లు కూడా బలంగా తయారవుతాయి.
అంతేకాదు.. శరీరంలోని రోగ నిరోధకత (immune strength) పెంచడంలో విటమిన్ D కీలక పాత్ర పోషిస్తుంది. కరోనావైరస్ మహమ్మారి సమయంలో విటమిన్ D తగినంత మోతాదులో శరీరానికి అందాల్సిన అవసరం ఉందని అంటున్నారు పోషక నిపుణులు. Covid-19 వ్యాధిని నిరోధించడంలో విటమిన్ D అద్భుతంగా పనిచేస్తుంది. కరోనా బాధితుల చికిత్సలో కూడా విటమిన్ D ఎంతో సాయపడుతుందని బోస్టన్ అధ్యయన పరిశోధకులు వెల్లడించారు.
కరోనా వైరస్ సోకిన (Coronavirus Patients) బాధితుల్లో ఆక్సిజన్ స్థాయి, విటమిన్ ‘డి’ తగినంత స్థాయిలో ఉండదు. శ్వాసపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటివరకూ మొత్తంగా 235 కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో 74 శాతం మంది కరోనా బాధితుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండగా.. వారిలో 32.8 శాతం మందిలో మాత్రమే D విటమిన్ తగినంత స్థాయిలో ఉంది.
కరోనా సోకిన బాధితులకు మాత్రమే కాదు.. కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యగా విటమిన్ D శరీరంలో తగినంత స్థాయిలో ఉండేలా చూసుకోవాలని పోషక నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ D తగినంత స్థాయిలో పొందాలంటే ఈ కింది 6 రకాల D-Rich Foods తినాలని సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
1. చేపలు :
ఆయిలీ లేదా ఫ్యాటీ కలిగిన సాల్మన్ (Salmon, tuna, mackerel) చేపల్లో vitamin D సమృద్ధిగా లభిస్తోంది. కొవ్వు చేపల కంటే వీటిలోనే ఎక్కువగా విటమిన్ D లభిస్తుంది.
2. గుడ్డు సొనలు (Egg Yolks) :
గుడ్డులోపల ఉండే పచ్చ సొన భాగంలో కూడా విటమిన్ D లభిస్తుంది. వాస్తవానికి తెల్లని భాగం కంటే పచ్చ సొనలోనే విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.
3. పుట్టగొడుగులు (Mushrooms) :
ఇదో ఆరోగ్యకరమైన కూరగాయల్లో ఒకటి. ఇందులో విటమిన్ D సమృద్ధిగా దొరుకుతుంది. ఈ పుట్టగొడుగులను రుచికరమైన వంటకాల్లో ఎన్నో వెరైటీలుగా వండుకుని తినొచ్చు..
4. తృణ ధాన్యాలు (Whole Grains) :
తృణ ధాన్యాలు.. అనగానే గోధుమలు, రాగి, బార్లీ, ఓట్స్.. వీటిలోనూ విటమిన్ D సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు ఆహారంలో తృణధాన్యాలను ఒక భాగంగా చేసుకోవాలి.
5. పాల ఉత్పత్తులు (Dairy Products) :
ప్రతిఒక్కరూ తమ డైట్‌లో పాల ఉత్పత్తులను వాడుతుండాలి. జున్ను, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు ఎక్కువగా మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి.
6. సోయా పాలు, బాదం పాలు :
ప్రతిరోజు పాలను వాడటానికి బదులుగా ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలను వాడొచ్చు. ఈ రెండింటిలోనూ విటమిన్ D పుష్కలంగా లభిస్తుంది.