Jaggery Benefits: చిన్న బెల్లం ముక్కతో భలే ఆరోగ్యం.. రాత్రి భోజనం తరువాత తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Jaggery Benefits: బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Jaggery Benefits: చిన్న బెల్లం ముక్కతో భలే ఆరోగ్యం.. రాత్రి భోజనం తరువాత తింటే ఎన్ని లాభాలో తెలుసా?

What are the health benefits of eating jaggery at night?

Updated On : July 21, 2025 / 11:27 AM IST

బెల్లం మానవ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నిజానికి మన భారతీయ సంస్కృతిలో దీనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా శీతాకాలంలో ఎక్కువగా వాడతారు. రాత్రి భోజనం తరువాత కొద్దిగా బెల్లం తినడం అనేది మన పూర్వీకుల జీవన శైలిలో భాగంగా ఉండేది. ఈ అలవాటు వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆధునిక శాస్త్రపరమైన పరిశోధనల ద్వారా కూడా నిరూపితమయ్యాయి. కానీ, ఈ మధ్య కాలంలో ఈ అలవాటు చాలా తగ్గిపోయింది. మరొక్కసారి రాత్రి భోజనం తరువాత బెల్లం తిన్నతరువాత కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1.జీర్ణక్రియకు సహాయపడుతుంది:
బెల్లంలో ఉండే సహజమైన ఎంజైములు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పేగుల పనితీరును ప్రోత్సహించి, అసిడిటీ, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

2.లివర్ డిటాక్సిఫికేషన్‌కు సహాయం:
బెల్లం అనేది సహజమైన డిటాక్సిఫయర్. ఇది లివర్ నుంచి విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తరువాత తీసుకోవడం వల్ల రాత్రంతా శరీర శుద్ధి ప్రక్రియను ప్రోత్సహిస్తుంది.

3.రక్త శుద్ధి:
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిని రాత్రి తినడం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

4.ఓరల్ హెల్త్‌కు మేలు:
బెల్లంలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు నోటి లోపల బాక్టీరియా పెరగకుండా నివారిస్తాయి. ఇది దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయకారిగా ఉంటుంది.

5.చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం:
బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇది చక్కెర కంటే చాలా ఆరోగ్యకరమైనది. భోజనం తరువాత ఏదైనా తీపిగా తినాలనిపించినప్పుడు బెల్లం అత్యుత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.

6.శరీర ఉష్ణోగ్రత నియంత్రణ:
బెల్లం శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. ముఖ్యంగా వేసవి రాత్రుల్లో బెల్లం తినడం వల్ల శరీరంలో తాపాన్ని తగ్గించుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు అవసరం:

  • మధుమేహం ఉన్నవారు బెల్లం తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవాలి.
  • అధిక పరిమాణంలో బెల్లం తీసుకోవడం మంచిది కాదు.
  • రోజు కేవలం 5 నుంచి 10 గ్రాముల బెల్లం మాత్రమే తినాలి

భోజనం తరువాత బెల్లం తింటే ఆరోగ్యం వందశాతం నిజం. మన శరీరానికి సహజంగా మేలు చేసే బెల్లాన్ని మన రోజువారీ జీవనశైలిలో చేర్చుకోవడం ద్వారా అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు.