White Onions Benefits: తెల్ల ఉల్లిపాయతో గుండె భద్రం.. కొలెస్ట్రాల్ మాయం.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు
తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

White onion benefits
ఉల్లిపాయలు మన వంటకాలలో చాలా ప్రధానమైన కూరగాయ. ఉల్లి లేకుండా వంటను ఊహించడం కూడా కష్టమే. ఈ ఒక్క మాట చాలు ఉల్లిపాయాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది అర్థమవుతుంది. మనిషి ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయలు ఎన్నోరకాల ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఈ ఉల్లిపాయల్లో కూడా రెండు, మూడు రకాలు ఉన్నాయి. మనకు బాగా తెలిసినవి మాత్రం తెల్లవి, ఎర్రవి మాత్రమే. ఈ రెండిటిలో కూడా తెల్ల ఉల్లి వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి.. రక్త నాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ ప్రమాదం నుండి బయటపడవచ్చు. తెల్ల ఉల్లిపాయల్లో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యంలో ఉంచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. ఇంకా తెల్ల ఉల్లిలో యాంటీ క్యాన్సర్ గుణాలు కుక్కడ ఎక్కువే. వీటిని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
తెల్ల ఉల్లిపాయలను ప్రీ బయోటిక్ ఫుడ్‌గా కూడా చెబుతారు. ఎందుకంటే.. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఆహారంలో పోషకాలను శరీరానికి అందజేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు, ఇన్‌ఫెక్షన్లకు, దగ్గు, జలుబు, ఫ్లూ రాకుండా కాపాడుతుంది. తెల్ల ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇందులో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఉల్లిపాయలను రోజు తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఆర్థరైటిస్ నొప్పులను, వాపుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.