షాకింగ్ వీడియో: జనాల్లోకి దూసుకొచ్చిన టాటా ఏస్.. ఒకరు మృతి

  • Published By: vamsi ,Published On : May 3, 2019 / 05:22 AM IST
షాకింగ్ వీడియో: జనాల్లోకి దూసుకొచ్చిన టాటా ఏస్.. ఒకరు మృతి

Updated On : May 3, 2019 / 5:22 AM IST

మృత్యువు ఎటునుంచి ఎటువైపు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేం. రోడ్లపైన ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు ప్రాణాలు తీసేస్తున్నాయి. సికింద్రాబాద్ వారసిగూడ చౌరస్తాలో మే 02వ తేదీ గురువారం రాత్రి టాటా ఏస్‌ వాహనం బీభత్సం సృష్టించింది.

వారసిగూడలో వివాహ వేడుక జరుగుతోంది. ఈ సమయంలో టాటా ఏస్ వాహనాన్ని ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఆపి ఉంచాడు. అది ఆన్‌లోనే ఉంది. అందులో ఉన్న బాలుడు యాక్సిలేటర్ నొక్కాడు. ఒక్కసారిగా అది ముందుకు దూసుకపోయింది.

బ్యాండ్ వాయిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ఆటో జనాలను గుద్దుకుంటూ వెళ్లిపోయింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఓ వ్యక్తి చనిపోగా.. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.