Kcr Flies To Hyderabad: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. కేసీఆర్ గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై, అక్కడి నుంచి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాల పనులను పర్యవేక్షించారు. అక్టోబరు 5న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చుతూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.

Kcr Flies To Hyderabad: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన కేసీఆర్

Updated On : October 19, 2022 / 2:37 PM IST

Kcr Flies To Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. కేసీఆర్ గత ఎనిమిది రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరై, అక్కడి నుంచి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాల పనులను పర్యవేక్షించారు. అక్టోబరు 5న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చుతూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు.

దీంతో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. జాతీయ స్థాయిలో కేసీఆర్ తమ పార్టీ బలాన్ని పెంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో ఆయన బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడి బీఆర్ఎస్ కార్యాలయాల పనులను స్వయంగా పరిశీలించడం గమనార్హం. మునుగోడు ఉప ఎన్నిక, వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు వేసుకుంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..