10టీవీ ఎక్స్ క్లూజివ్ : ఒంటేరు TRSలో చేరటానికి కారణలివే

  • Published By: madhu ,Published On : January 18, 2019 / 07:56 AM IST
10టీవీ ఎక్స్ క్లూజివ్ : ఒంటేరు TRSలో చేరటానికి కారణలివే

Updated On : January 18, 2019 / 7:56 AM IST

గజ్వేల్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి…గత ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా..ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2014, 2018లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఒంటేరు. 30 ఏళ్లు రాజకీయాల్లో…15 ఏళ్లు టీఆర్ఎస్‌పై పోరాటం చేసిన ఈయన ‘కారు’ ఎక్కడానికి డిసైడ్ అయిపోయారు.

జనవరి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు…ప్రగతి భవన్‌కి రావాలని సన్నిహితులకు..సహచరులకు స్వయంగా వాట్సప్ సందేశం పంపారు. ఒంటేరు పార్టీ మారటానికి కారణాలేంటో ఆయన మాటల్లోనే విందాం. ఒంటేరు వాట్సప్ వీడియో 10టీవీ ఎక్ల్సూజివ్‌గా సంపాదించింది. ఒంటేరు పార్టీ మారటంపై కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏంటో కూడా చూద్దాం…