కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

  • Published By: murthy ,Published On : October 23, 2020 / 08:36 AM IST
కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి

Updated On : October 23, 2020 / 10:53 AM IST

Covaxin Cleared For Phase 3  Clinical Trials : ప్రపంచ ప్రజలంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నకరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి తుదిదశ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. భారత్ వైద్య పరిశోధనామండలి(ఐసీఎంఆర్) తో కలిసి హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ సంస్ధ తయరు చేస్తున్న కరోనా టీకా విషయంలో మరో ముందుడుగు వేసింది.

దేశీయంగా రెండు సంస్ధలు సంయుక్తంగా అభివృధ్ది చేస్తున్న కోవాగ్జిన్ ముడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతిచ్చింది. కరోనా మూడోదశ ట్రయల్స్ అనుమతి కోసం భారత్ బయోటెక్ అక్టోబర్ 2న డీసీజీఐకు చేసుకున్న దరఖాస్తుకు అనుమతి లభించింది.


దేశంలోని 10 రాష్ట్రాల్లో 19 వేర్వేరు ప్రాంతాల్లో 18 ఏళ్లకు పైబడిన వారిపై ఈ పరిశోధన చేయనున్నట్లు సంస్ధ డీజీసీఐకి తెలిపింది. మరోవైపు జైడస్ క్యాడిలా సంస్ధ అభివృధ్ది చేస్తున్న కోవిడ్ టీకా సైతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తోంది. పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రా జెనికాతో కలిసి రూపోందిస్తున్న టీకా క్లినికల్ ట్రయల్స్ మన దేశంలో రెండో మూడో దశలో ఉన్నాయి.
https://10tv.in/dozens-to-be-deliberately-infected-with-coronavirus-in-uk-human-challenge-trials/