తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు

హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 01:00 PM IST
తలసాని జోస్యం : బీజేపీకి 160, కాంగ్రెస్‌కు 75 ఎంపీ సీట్లు

Updated On : April 2, 2019 / 1:00 PM IST

హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ

హైదరాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 160 సీట్లు, కాంగ్రెస్ కు 75 సీట్లకు మించి రావని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ ఎంపీ సీటు కూడా గెలవదన్నారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని తలసాని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పై ప్రధాని మోడీ చేసిన విమర్శలకు తలసాని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని మోడీ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
Read Also : మోడీ అబద్దాల కోరు..నిజాయితీ ఉందా – కేసీఆర్

కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామా లేదా అని తలసాని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథకు అవార్డులు ఇచ్చింది మీరు కాదా? అని కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో అభివృద్ధి జరగనిదే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆఖండ విజయం సాధించిందా? అని అడిగారు. హైదరాబాద్ లో ప్రధాని మోడీ ఒక్క పనైనా చేశారా అని తలసాని ప్రశ్నించారు. భారత్ లో తెలంగాణ అంతర్భాగం కానట్టు.. కేంద్రమంత్రి పదవి నుంచి దత్తాత్రేయను తొలగించారని తలసాని మండిపడ్డారు.

రాజకీయ లబ్ది కోసం సర్జికల్ స్ట్రయిక్స్ వాడుకుంటున్నారని బీజేపీపై తలసాని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు మాత్రమే బీజేపీ నేతలు హిందుత్వ అంటారని విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం దేశాన్ని తాకట్టు పెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని తలసాని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉందని, రాష్ట్రంలో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని తలసాని చెప్పారు.
Read Also : పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా : పవన్‌కు ప్రశ్న