OMG : మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన బాలుడు

  • Published By: veegamteam ,Published On : April 19, 2019 / 06:04 AM IST
OMG : మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగిన బాలుడు

Updated On : April 19, 2019 / 6:04 AM IST

శంషాబాద్-హైమద్ నగర్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండాకాలం దాహం వేస్తోంది. దీంతో మంచినీరు అనుకుని యాసిడ్ తాగిన ఓ చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంవత్సరం వయస్సున ఆజాం అనే బాలుడు యాసిడ్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆజాం మృతి చెందాడు. 
Also Read : TMC ప్రచారంలో బంగ్లా యాక్టర్స్: ఇండియా వదిలి పోమ్మంటు కేంద్రం ఆర్డర్స్

ఎండలు మండిపోతున్నాయి. దాహం కూడా విపరీతంగా వేస్తోంది. ఈ క్రమంలో చిన్న పిల్లల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. దాహం వేసినా నోరు తెరిచి అడగలేని పసివారు. అందుకేవారికి 10-15 నిమిషాలకు ఒకసారి వారికి మంచినీరు పట్టించాలి. అందునా నడక వచ్చిన చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వారు కంటికి కనిపించినవే నీళ్లనుకుని తాగేసే ప్రమాదముంది.

ఇదిగో ఇటువంటి ఘటనే ఏడాది వయస్సున్న ఆజాం విషయంలో జరిగింది. ఏం జరిగిందో ఏమో గానీ దాహం వేసిన ఆజాం మంచినీరనుకుని యాసిడ్ తాగటం చిన్నారి ప్రాణం ఆగిపోయింది. కుటుంబంలో తీరని శోకం మిగిల్సింది. ఈ క్రమంలో వేసవికాలంలో చిన్నారుల విషయంలో పెద్దవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 
Also Read : మురళీ మోహన్ కోడలుకు యాక్సిడెంట్: అపోలోలో చికిత్స