ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.

ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
ప్రగతిభవన్‌లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష ముగిసింది. నాలుగు గంటలుగా సాగిన ఈ భేటీలో ఈడీ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శనివారం (అక్టోబర్ 26, 2019) ఉదయం 11 గంటలకు చర్చలకు అవకాశం ఉంది. ఈడీ కమిటీతో చర్చలు జరిగే చాన్స్ ఉంది. ఆర్థికంగా భారం కాని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదికను సీఎం కేసీఆర్ కు సమర్పించారు. ఈ నివేదికపై నాలుగు గంటలపాటు చర్చించారు. ఆర్టీసీ విలీనం మినహా కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది. హైకోర్టుకు సమగ్ర వివరాలు అందించేలా రిపోర్టులు తయారు చేశారు. ప్రతి అంశానికి రెండు రకాల సమాధానాలను సిద్ధం చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ రెండు రకాల నివేదికను తయారు చేసింది.
అద్దె బస్సుల అవసరంపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. డిమాండ్ల అమలుతో ఆర్టీసీపై పడే భారం వివరాలతో నివేదికలను సిద్ధం చేశారు. ప్రభుత్వం హైకోర్టులో ఈ నివేదికను దాఖలు చేయబోతున్న క్రమలో నివేదికలో ఏముందన్న దానికి సంబంధించి ఆసక్తి రేకెత్తిస్తోంది.