ప్రియాంక రెడ్డి హత్యపై సీఎం కేసీఆర్ సీరియస్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. అత్యాచారం, హత్య వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు.
ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నిందితులను హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ పాండునాయక్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితులకు షాద్ నగర్ పీఎస్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.
భారీ భద్రత మధ్య నిందితులను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో వేలాదిగా ఆందోళనకారులు ఉన్నారు. నిందితులను జైలుకు తరలిస్తుండగా నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు సంచలనం కలిగిస్తోంది. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ వినిపిస్తోంది.
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రికత్త కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు. నిందితులను కోర్టుకు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తహసీల్దార్ ను రప్పించారు. తహసీల్దార్ ముందు నిందితులను హాజరుపరిచారు.