కొత్త పురపాలక, రెవిన్యూ చట్టాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు

నూతన పురపాలక చట్టం, రెవిన్యూ చట్టం రూపకల్పనపై సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. అవినీతికి ఆస్కారం లేకుండా కొత్త చట్టాల రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. IAS తరహాలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తెలంగాణ అర్బన్ పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ పేరును జిల్లా పరిపాలనాధికారిగా మార్చేందుకు యోచిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఏప్రిల్ 22 నుంచి మే14వ తేదీ లోపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ప్రతిపాదన పంపింది.