వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 10:17 AM IST
వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి

Updated On : April 3, 2020 / 10:17 AM IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దేశంలోనే తొలిసారిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యసిబ్బంది, ఆస్పత్రులపై దాడులకు వ్యతిరేకంగా 2007లో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేసిన ఆ చట్టాన్ని వెంటనే అమలులోకి తేవాలని తెలుగు రాష్ట్రాల్లోని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓ ప్రకటన విడుదల చేశారు. వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేవీపీ కోరారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో అందరి క్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించే మార్గదర్శకాలను, విధించే ఆంక్షలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు కష్టాల్లో ఉన్నవారికి పార్టీ కార్యకర్తలు సాయం అందించాలని ఆయన సూచించారు. 

Also Read | వాళ్లందరికీ పరీక్షలు చేయండి – సీఎం జగన్ ఆదేశాలు