కాంగ్రెస్ ఔట్ : కారులోకి అజారుద్దీన్

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 03:30 AM IST
కాంగ్రెస్ ఔట్ : కారులోకి అజారుద్దీన్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌కి మరో షాక్ తగిలేలా ఉంది. కాంగ్రెస్ కీలక నేత అధికార టీఆర్ఎస్‌లో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడటంతో అజారుద్దీన్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల ఓ ఎంపీ కూతురి పెళ్లిలో టీఆర్‌ఎస్‌ కీలక నేతలతో అజార్ చర్చలు జరిపారట. అజారుద్దీన్‌ను పార్టీలోకి తీసుకొని సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు ఆ ఎంపీ విజ్ఞప్తి చేసినట్టు వార్తలొస్తున్నాయి. సంక్రాంతి తర్వాత అజారుద్దీన్‌ అధికారికంగా కారెక్కుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ 2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణకే పరిమితమయ్యారు.