తెలంగాణలో 144 సెక్షన్, హోటల్స్ మూసివేత, ఆర్టీసీ బస్సులు బంద్..కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం(మార్చి 18,2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ కరోనా కట్టడిపై ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ గురువారం(మార్చి 19,2020) మధ్యాహ్నం రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో ఈ సమావేశం జరగనుంది. పలువురు మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటు అధికారులకు ఇటు ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కరోనాతో తలెత్తిన పరిస్థితిని తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియంత్రణ పద్దతులను ఇవాళ్టి సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15 రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో 7 రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తోంది. ఇవాళ్టి అత్యున్నత అత్యవసర సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొంటారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేసే యోచనలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం, 144 సెక్షన్ యోచన చేస్తోందట.
కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం:
* తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్
* హోటల్స్ మూసివేసే యోచన
* రవాణ మార్గాలపై ఆంక్షలు విధించే అవకాశం
* పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నిలిపివేసే ఛాన్స్
* అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటున్న ప్రభుత్వం
* ప్రభుత్వ కార్యాలయాల్లో కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశం
* హైదరాబాద్ లో మరింత సీరియస్ గా ఆంక్షలను అమలు చేయనున్న ప్రభుత్వం
* ఫిబ్రవరి, మార్చిలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరణ
* గ్రామ స్థాయి నుంచే సమాచారం సేకరిస్తున్న ప్రభుత్వం