డెటా థెప్ట్ : ఏపీ, తెలంగాణలో రాజకీయ దుమారం

కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మరో వివాదం నడుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏపీ ప్రజల డేటా చౌర్యం జరుగుతుందన్న ఆరోపణలతో ఇరు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మార్చి 04వ తేదీ సోమవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిఆర్ఎస్, టిడిపి, వైసీపీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ప్రజల సమాచారాన్ని టీడీపీ పార్టీకి చేరవేస్తున్నారనే దానిపై ఫిర్యాదు అందింది.
లోకేశ్వర్ రెడ్డి కంప్లయింట్‌తో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సైబరాబాద్ సీపీ విలేకరులకు తెలియచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ పోలీసులు విచారణ చేపట్టడంపై సీరియస్ అయ్యారు. వెంటనే ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో టీడీపీ స్పందిస్తోంది. జగన్‌కు టీఆర్ఎస్ సపోర్టు ఇస్తోందని..కుట్రలు చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపణలు గుప్పిస్తూ కాక పుట్టిస్తున్నారు.
మరోవైపు ఈ నెల 12 న జరుగనున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. 21 మంది ఎమ్మెల్యేల బలంతో ఒక్క స్థానాన్నైనా దక్కించుకోవాలని రంగంలోకి దిగిన కాంగ్రెస్‌కు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చి కారెక్కేందుకు రెడీ అయిపోయారు. అంతే కాదు తనకు 50 లక్షల ఆఫర్ చేశారంటూ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపణలు చేయడం ఆసక్తిరేపుతోంది.