చీకటి పడితే కిక్కే : బీర్లను ఆర్డర్ పెడుతున్న కుర్రోళ్లు

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 06:13 AM IST
చీకటి పడితే కిక్కే : బీర్లను ఆర్డర్ పెడుతున్న కుర్రోళ్లు

Updated On : April 8, 2019 / 6:13 AM IST

హైదరాబాద్ లో ఎండలు ఎలా మండిపోతున్నాయో.. అదే రేంజ్ లో బీర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కావాల్సిన బ్రాండ్ దొరకటం లేదు. ఏదో ఒకటి అనుకుంటే కూల్ ఉండటం లేదు. అదేమంటే స్టాక్ లేదనే మాట బార్ల నుంచి వస్తోంది. హైదరాబాద్ లో బీర్ల డిమాండ్ డబుల్ అయ్యింది. 

బీర్ల డిమాండ్ కు కారణాలు :

– సమ్మర్ సీజన్ – మండే ఎండలు

– ఎన్నికల ప్రచారం – పొలిటికల్ జోష్

–  IPL మ్యాచ్ లు

చీకటి పడితే కిక్కులో తేలుతోంది హైదరాబాద్. ఫుల్ జోష్ లో ఉంటుంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం, ఇంకో వైపు ఐపీఎల్ మ్యాచులతో బార్లకు కిటకిటలాడుతున్నాయి. బీర్లు లేవు అనే మాట వస్తుండటంతో ఉసూరుమంటున్నారు మందుబాబులు. ముందుగానే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. వెయిటర్ నాలుగు బీర్లు కూలింగ్ పెట్టు.. ఆ బ్రాండ్ బీర్లు ఓ నాలుగు ఉంచమ్మా అని చెబుతున్నారు.

ఫిబ్రవరి నెలలోనే ఒక్కో వైన్ షాపు రోజుకి 1,500 బీరు బాటిల్స్ ను  అమ్మగా.. ఇప్పుడు అది 3వేలకు చేరింది. ఇక బార్లు, పబ్స్ లో అయితే డబుల్ అయ్యింది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా నగరంలో బీరు వినియోగం భారీగా పెరిగింది. ఐపీఎల్ మ్యాచ్ ఉంటే ఈ అమ్మకాల డిమాండ్ మరింతగా పెరిగే అవకాశాలుంటాయంటున్నారు. 

కింగ్ ఫిషర్, టుబర్గ్, RC, నాకౌట్ బీర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. గత ఐపీఎల్ సీజన్ల కంటే ఈసారి బీర్లకు డిమాండ్ మరింత పెరుగుతోందని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వైన్ దుకాణ యజమానులు తమ కష్టమర్స్ కు బీర్లను ఫ్రిజ్ లలో కూల్ చేసి మరీ అమ్మతున్నామని..లేదా బాక్సులలో ఐస్ క్యూబ్స్ వేసి వాటిలో స్టోర్ చేసి విక్రయిస్తున్నామని తెలిపారు. అలాగే వీకెండ్స్ లలో బీర్ అమ్మకాలు మరింతగా పెరుగుతున్నాయని వెల్లడించారు. అయినా సరిపోవటం లేదని.. ఎన్నికల సీజన్, ఐపీఎల్ ఒకేసారి రావటంతో ఈ డిమాండ్ పెరిగినట్లు తెలిపారు. వారం రోజులు ఆగితే ఎన్నికల ప్రచారం ముగుస్తుందని.. ఆ తర్వాత డిమాండ్ లో మార్పులు ఉండొచ్చని ప్రకటించారాయన.