జగన్‌ను కలిసిన శివకుమార్.. బహిష్కరణ ఎత్తివేసిన వైసీపీ

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 09:23 AM IST
జగన్‌ను కలిసిన శివకుమార్.. బహిష్కరణ ఎత్తివేసిన వైసీపీ

తెలంగాణ ఎన్నికల సమయంలో మహాకూటమికి వైసీపీ మద్దతు ఇస్తుందంటూ ప్రకటించి బహిష్కరణకు గురైన వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్‌‌పై ఆ పార్టీ బహిష్కరణను ఎత్తివేసింది. శివకుమార్ తనను బహిష్కరించడంపై న్యాయపోరాటానికి దిగుతానంటూ ప్రకటించగా వ్యవస్థాపక అధ్యక్షుడినైన తనను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. శివకుమార్ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం జగన్‌కు నోటీసులు జారీచేసింది.
Also Read : జగన్ గారూ.. సైబ‌ర్ క్రైమ్ పుట్టిందే మీ ఇంట్లో!

వైసీపీలో అధ్యక్షుడి నియామకం అంశం తేలేవరకు ఆ పార్టీకి ఫ్యాన్‌ గుర్తు కేటాయింపును తాత్కాలికంగా నిలిపేయాలని ఎన్నికల సంఘాన్ని శివకుమార్ కోరారు. వైసీపీని స్థాపించినపుడు రూపొందించిన పార్టీ నిబంధనావళిని ప్రస్తుత నాయకత్వం పూర్తిగా ఉల్లంఘిస్తోందని, పార్టీ వ్యవస్థాపకుడినైన తనను ఏకపక్షంగా బహిష్కరించారంటూ ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో జగన్‌తో భేటి అయిన శివకుమార్.. తనపై బహిష్కరణను ఎత్తివేసినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.

ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ శివకుమార్ విమర్శించారు. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కావడం కాయం అంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా 2009లో వైసీపీని స్థాపించిన శివకుమార్, అనంతరం వైఎస్సార్ కుటుంబంపై వున్న అభిమానంతో ఆ పార్టీని జగన్‌కు అప్పగించారు. నాటి నుంచి జగన్ అధ్యక్షుడిగా, విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతుండగా, శివకుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
Also Read : టీడీపీకి షాక్.. వైసీపీలోకి జయసుధ