అమెరికాలో ఉన్నట్లే : KBR జంక్షన్ లో ఎమర్జెన్సీ టవర్

టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరసమయాల్లో పోలీసులు, ప్రజలను కనెక్ట్ చేసేలా హైదరాబాద్ పోలీసులు మరో అడుగు మందుకేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు ప్రజలు ఏదైనా సంఘటన గురించి పోలీసులకు తెలియజేయాలంటే 100కి ఫోన్ చేయ్యడం లేదా నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లడం లేదా HAWK Eye మొబైల్ యాప్ ని ఉపయోగించే వారు. అయితే ఇవేవి అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీ ద్వారా ఒక్క బటన్ నొక్కితే చాలు మీ సమస్యను పరిష్కరిస్తామంటూ నగర పోలీసులు ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై నగరవాసులు ఎప్పుడైనా సరే ఒకే ఒక్క బటన్ నొక్కి చాలా ఈజీగా పోలీసు కంప్లెయింట్ ఫైల్ చేయవచ్చు.
హైదరాబాద్ సిటీ పోలీసులు బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర్లో ఓ చిన్నసైజు దిమ్మె ఆకారంలో ఉన్నఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీని పేరు SOS టవర్. ఈ టవర్ కింది భాగంలో ఓ బటన్ ఉంటుంది. పోలీసులకు కంప్లెయింట్ చెయ్యాలనుకున్నవారెవరైనా ఈ బటన్ ని వత్తి, మాట్లాడి తమ ఫిర్యాదు ఏంటో అక్కడ చెబితే నేరుగా ఆ కంప్లెయింట్ వెంటనే స్థానిక పోలీసులకే కాకుండా కంట్రోల్ రూమ్ కి వెళ్లిపోతుంది. అంతేకాకుండా ఫిర్యాదుదారు, చుట్టుపక్కల విజువల్స్ ను రికార్డ్ చేసేందుకు ఈ టవర్ పై భాగంలో డోమ్ కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.
ఈ కొత్త టెక్నాలజీ ప్రజలు కంప్లెయింట్ చేసే విధానాన్ని మార్చేస్తుందని అధికారులు తెలిపారు. నేరాలను నియంత్రించడం, ప్రజలకు రక్షణ వాతావారణాన్ని కల్పించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు ఉపయోగిస్తున్న సరికొత్త అత్యాధునిక టెక్నాలజీలలో ఇది కూడా ఒకటని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నాలుగు రోజుల క్రితం కేబీఆర్ పార్క్ దగ్గర్లో ఒక్క టవర్ ని మాత్రమే ఏర్పాటు చేసినట్లు బంజారాహిల్స్ అడిషనల్ ఇన్స్ పెక్టర్ కే.రవికుమార్ తెలిపారు. ఈ పార్క్ కి విఐపీలు, సెలబ్రిటీలు, ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే వాళ్లు ఎక్కువగా ఉండే ముఖ్యమైన ప్లేస్ కావడం వల్ల ఇక్కడ SOS టవర్ ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ టవర్ ద్వారా ఇప్పటివరకు పోలీసులు రెండు కంప్లెయింట్ లు అందుకున్నారు.
Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు
Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో
Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు