నలుగురు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు సస్పెండ్ 

  • Published By: madhu ,Published On : November 7, 2019 / 04:02 AM IST
నలుగురు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు సస్పెండ్ 

Updated On : November 7, 2019 / 4:02 AM IST

నగరంలోని పీఎస్‌లలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులపై వేటు పడింది. అక్రమంగా హుక్కా సెంటర్లు నడుపుతున్న వారికి సహకరించి, విధుల్లో ఉండగానే లంచాలు తీసుకున్న నలుగురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, ఇద్దరు ఏఎస్ఐలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ 2019, నవంబర్ 07వ తేదీ గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్ పరిధిలోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో గతంలో పనిచేసిన ఎస్ఐలు గురుమూర్తి, ప్రస్తుతం పనిచేస్తున్న డి.శ్రీను, ఈ. శంకర్, రామకృష్ణలు, ఏఎస్ఐలుగా ఉన్న మహ్మద్ జాఫర్, శ్యాముల్‌లు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. హుక్కా సెంటర్లు సమయ పాలన పాటించకకపోవడం, యాజమాన్యాలకు వీరు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో హుక్కా సెంటర్లకు సహకరించిన వారిపై వేటు వేయాలనీ సీపీ నిర్ణయించారు. 
Read More : దేవుడే దిగి వచ్చినా : నంబర్లు మార్చడంపై ఇన్ఫీ ఛైర్మన్ వివరణ