చెత్తకుప్పలు తీసేసి మొక్కలు నాటండి : GHMC ఆర్డర్

హైదరాబాద్ బహిరంగ ప్రదేశాల్లోను. రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్క చెత్త ఉండే కుప్పలవెంబడి చెత్త కుప్పలను తొలిగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలను తొలగించి శుభ్రపరచి అక్కడ మరోసారి చెత్త వేయకుండా మొక్కలు నాటాలనీ ఆదేశించారు.
పరిసరాలు పరిశుభ్రంగా లేకుండా దోమలు పెరుగుతాయనీ..దాంతో అంటు వ్యాధులు ప్రబలుతాయని కాబట్టి బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయటాని ప్రజలు మానుకోవాలని సూచించారు. చెత్త ఉన్న ప్రదేశాలలో చెత్తను తొలగించి మొక్కలు నాటి పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దాలని మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఈక్రమంలో కమిషనర్ నగరాన్ని క్లీన్ గా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
దీని కోసం డిప్యూటీ కమిషనర్లు, వైద్య అధికారులను సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో చెత్త వేసే బహిరంగ ప్రదేశాలు 1116 ఉండగా కమిషనర్ ఆదేశాల మేరకు వాటిని తొలగించారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో మళ్లీ నగరంలోని బహిరంగ ప్రదేశాలలో చెత్త యథావిధిగా పేరుకుపోయింది. పలు చౌరస్తాలు..మెయిన్ సెంటర్స్, కమర్షియల్ ఏరియాల్లో చెత్త సమస్యగా తయారైంది.
ఈ క్రమంలో చెత్త కుప్పలను తొలిగించటమే కాకుండా మళ్లీ చెత్త వేయకుండా ఉండేందుకు మొక్కలు నాటాలని ఆదేశించారు. దీని కోసం నిఘా వేయాలనీ..నిఘా వేసేందుకు స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలనీ సూచించారు. చెత్త తొలగించిన ప్రదేశాలలో మరోసారి చెత్త వేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. చెత్త కుప్పలు ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ ముగ్గులు వేయాలని..మొక్కలు నాటాలని సూచించారు.