2020లో సెలవులు ఇవే : జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 02:53 PM IST
2020లో సెలవులు ఇవే : జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

Updated On : November 21, 2019 / 2:53 PM IST

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. 2019కి గుడ్ బై చెప్పి 2020లోకి అడుగుపెట్టబోతున్నాము. కాగా, 2020లో సెలవులు ఎన్ని.. ఏయే రోజు సెలవు ఉంది.. పండుగలు ఏ రోజు వచ్చాయి.. ఈ వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. హాలిడేస్ కు అనుగుణంగా టూర్లు ప్లాన్ చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను.. సెలవులను ప్రకటించింది. 

గవర్నర్ తమిళసై ఆదేశాల ప్రకారం చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషీ సెలవుల జాబితాను ప్రకటించారు. రంజాన్, మొహర్రం, బక్రీద్ పండుగలు మారే అవకాశం ఉండొచ్చని తెలిపారు. గురువారం(నవంబర్ 21,2019) సాయంత్రం ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో 27 సాధారణ సెలవులు, 17 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి.