హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 10:56 AM IST
హైదరాబాద్ లో భారీ వర్షం

Updated On : October 12, 2019 / 10:56 AM IST

హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. శనివారం(అక్టోబర్ 12, 2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం 3 గంటలకే చీకట్లు అలుముకున్నాయి. సాయంత్రం 4.30 నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

నగరంలోని పలు చోట్ల వాన కురుస్తోంది. వర్షంతో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతోంది. ముందుకు వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు వాహనదారులు. గడిచిన 48 గంటల్లో రాజధానిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.