ఎమ్మెల్యే చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.

వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది.
వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. నాలుగు వారాలపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆదేశించింది. ఇక నుంచి ఎమ్మెల్యే చెన్నమనేని భారత పౌరుడు, అతడు ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని కేంద్ర హోంశాఖ తేల్చింది. భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని హోంశాఖ తెలిపింది. కేంద్ర హోంశాఖ తీర్పుపై చెన్నమనేని అసంతృప్తి వ్యక్తం చేశారు.
చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు మరోసారి హైకోర్టుకు చేరింది. పౌరసత్వాన్ని రద్దు చేస్తూ జారీ చేసిన ఆదేశాలను వెంటనే కొట్టివేయాలని మరోసారి చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ చెన్నమనేని గురువారం(నవంబర్ 21, 201) హైకోర్టులో పిటిషన్ వేశారు. చెన్నమనేని వేసిన పిటిషన్ పై శుక్రవారం(నవంబర్ 22, 2019) హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చెన్నమనేని రమేష్. అప్పటినుంచీ ఆయన పౌరసత్వంపై వివాదం రగులుతూనే ఉంది. జర్మనీ దేశస్తురాలిని వివాహం చేసుకోవడంతో పాటు… ఆ దేశ పౌరసత్వాన్ని పొందారన్నది రమేష్ బాబుపై ఉన్న ఆరోపణ. ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగిపొందడానికి… నిబంధనలు పాటించకుండా తప్పుడు ధృవపత్రాలను సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. 2009లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హై కోర్టు 2013 ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు రమేష్ బాబు. అలాగే పౌరసత్వ వివాదం కేంద్ర హోంశాఖే తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.