ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ప్రభుత్వం స్పందన తర్వాతే

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 09:31 AM IST
ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ప్రభుత్వం స్పందన తర్వాతే

Updated On : November 24, 2019 / 9:31 AM IST

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. తమ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమవారం(నవంబర్ 25,2019) అన్ని డిపోల దగ్గర సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు తెలుపుతామన్నారు.

ఆదివారం(నవంబర్ 24,2019) డిపోల దగ్గర చేపట్టిన మానవహారం కార్యక్రమం విజయవంతం అయిందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 51 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మె యధావిథిగా కొనసాగుతుందని.. సోమవారం(నవంబర్ 25,2019) అన్ని డిపోలు, బస్టాండ్‌లు, ప్రధాన కూడళ్లలో సేవ్‌ ఆర్టీసీ పేరుతో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చామన్నారు.
 

ఆర్టీసీ సమ్మె 51వ రోజుకు చేరుకోవడంతో ఎంజీబీఎస్‌లో మహిళా కండక్టర్లు నిరసన ప్రదర్శనకు దిగారు. సేవ్‌ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. తమను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. సమ్మెను విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం తమను విధుల్లోకి ఆహ్వానించకపోవడం దారుణం అని మహిళా కండక్టర్లు అన్నారు.

సమ్మె ప్రారంభమై 50రోజులు దాటింది. ఇన్ని రోజులు సమ్మె చేసినా… ప్రభుత్వం దిగిరాలేదు. చివరికి తమంతట తామే విధుల్లోకి చేరతామని చెప్పినా… ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. పైగా ప్రైవేట్ పర్మిట్లవైపు చూస్తోంది. 5వేల 100 ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులకు రూటు పర్మిట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే ఆర్టీసీలో ప్రభుత్వ బస్సులు, అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. మొత్తం 10వేల 460 బస్సుల్లో అద్దె బస్సులు 2వేల 103 ఉన్నాయి. వీటిని పూర్తిగా తొలగించి… 5వేల 100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వనున్నారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ బస్సుల్లో వసూలు చేస్తున్న ఛార్జీలే తీసుకుంటాయన్నది ప్రభుత్వం ఇస్తున్న హామీ.