ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

  • Published By: chvmurthy ,Published On : September 10, 2019 / 03:29 AM IST
ఖైరతాబాద్ గణపయ్య నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Updated On : September 10, 2019 / 3:29 AM IST

హైదరాబాద్ లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో  పేరేన్నికగన్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి అధికారులు షెడ్యూల్ సిధ్దం చేశారు. గణేష్ ఉత్సవ కమిటీ, పోలీసు అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేషుడిని తొలి నిమజ్జనం చేయనున్నారు. అప్పటి వరకు ఇతర విగ్రహాల నిమజ్జనాలను నిలిపివేస్తారు. సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం గం.11-30 నుంచి గం.12 ల మధ్య హుస్సేన్ సాగర్ లోని 6వ నెంబర్ క్రేన్ వద్ద  నిమజ్జనం చేయాలని నిర్ణయించారు.  
నిమజ్జనానికి గణేషుడ్ని ఊరేగింపుగా తీసుకువెళ్లే లారీ ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుంది. 

మంగళవారం సెప్టెంబర్ 10వ తేదీ …ఈరోజు అర్ధరాత్రి నుంచి మహగణపతి షెడ్డు తొలగింపు పనులు ప్రారంభిస్తారు.
బుధవారం సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి 9 గంటలకు వినాయకుడిని లారీపై తరలించేందుకు భారీక్రేన్ మండపం వద్దకు చేరుకుంటుంది.
రాత్రి 11 గంటల నుంచి మహా గణపతికి  ఇరువైపులా  ఉన్న చిన్న చిన్న విగ్రహాలను కదిలిస్తారు.

గురువారం సెప్టెంబర్ 12 తెల్లవారుఝూమున 4 గంటలకు మహా గణపతిని క్రేన్ల సహాయంతో లారీ పైకి చేరుస్తారు
గురువారం సెప్టెంబర్ 12 ఉదయం 7 గంటలకుఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ కు శోభాయాత్ర ప్రారంభం అవుతుంది
గురువారం సెప్టెంబర్ 12 ఉదయం 10-30 గంటలకు నిమజ్జనం జరిగే  6వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుంది. మహగణపతిరి చివరి పూజ జరపుతారు. అనంతరం 11-30 గంటల నుంచి 12  గంటలమధ్య నిమజ్జనం పూర్తి చేస్తారు.