మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూత

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు గుండెపోటుతో మృతి చెందారు. సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో బసవతారకం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలెటర్‌పై ఉంచి గుండెకు సంబంధించిన నిపుణులు చికిత్స అందించారు. ఆయన్ను కాపాడటానికి ప్రయత్నించారు. ఆస్పత్రికి వచ్చే సమయంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారని, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని వైద్యులు వెల్లడించారు. చివరకు ఆయన కన్నుమూశారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
2019 ఎన్నికల అనంతరం కేసులతో సతమతమవుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవలే అనారోగ్యం చెందడంతో గుంటూరులో ఉన్న అల్లుడి నివాసంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చారు. మూడు రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉన్నా..ఆయన చేయించుకోలేదని తెలుస్తోంది.
ఆయన కుమారుడు, కుమార్తెలపై కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుమారుడికి చెందిన హోండా షోరూంను సీజ్ చేశారు పోలీసులు. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ను కోడెల వాడుకున్నట్లు తేలింది. భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొడుకు, కుమార్తెలు ఎక్కడున్నారో తెలియడం లేదు. కోడెలకు అస్వస్థతకు గురయ్యారనే సమాచారాన్ని వారికి తెలియచేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు.
Read More : టీడీపీ కార్యకర్త కత్తితో వీరంగం