ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు బంద్

హైదరాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం షాపులను మూసి వేయాలని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండల లో ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు.