గృహప్రవేశం : చిత్తారమ్మ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం

  • Published By: madhu ,Published On : November 14, 2019 / 12:00 PM IST
గృహప్రవేశం : చిత్తారమ్మ బస్తీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం

Updated On : November 14, 2019 / 12:00 PM IST

కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 డబుల్ బెడ్ ఇండ్లను ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. లబ్దిదారులచే గృహ ప్రవేశం చేయించారు. ఈ ఇండ్లను రూ. 9.34 కోట్ల వ్యయంతో నిర్మించింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటించి..పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు.

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారులకు అందచేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివాసాల కోసం జీహెచ్ఎంసీ టెండర్లను పిలిచిన సంగతి తెలిసిందే. 

Read More : వాయిదాల పర్వం : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే
నర్సాపూర్ చౌరస్తాకు సమీపంలో చిత్తారమ్మ బస్తీ ఉంది. ఆర్థిక బలహీనత..అద్దె ఇళ్లలో ఉండలేక..డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడిస్తారా అని చూసిన పేద ప్రజల గంపెడాశలు నెరవేరినట్లైంది. 2016లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 9 అంతస్తుల్లో ఒక్కో ఫ్లోర్‌కు 12 చొప్పున 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు. నివాసాలు రావడంతో లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమౌతోంది.