ఫిబ్రవరి 24 వరకూ నుమాయిష్

హైదరాబాద్ : నుమాయిష్‌ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్సి ఉంది. అయితే ప్రమాదం జరగటం..భయాందోళనలకు గురైన సందర్శకులు నుమాయిష్ కు వచ్చేందుకు ఆసక్తి చూపటంలేదు. ఈ క్రమంలో అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారుల కోసం..ఆసక్తి చూపే సందర్శకుల కోసం నుమాయిష్ గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నామని గంగారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదంలో వందలాది షాపులకు మంటలకు దగ్థమైపోెయిన విషయం తెలిసిందే.