పెరిగిన విజయ పాల ధరలు

తెలంగాణ రాష్ట్రంలో విజయ పాల ధరలు మళ్లీ పెంచింది ప్రభుత్వం. రెండేళ్ల వ్యవధిలోనే విజయపాల ధరను మరోసారి రెండు రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది అభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్). 16 డిసెంబర్ 2019 నుంచి లీటరుకు రూ.2 చొప్పున పాలధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.
పాడి రైతుల దగ్గరి నుంచి సేకరిస్తోన్న పాల ధరలు పెరగడంతో అమ్మే ధరలను కూడా పెంచాలని నిర్ణయించించారు. స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇప్పటివరకు విజయ పాలు లీటరుకు రూ.42కి అమ్ముతుండగా.. ఇకపై రూ.44కు అమ్మాలని నిర్ణయించారు.
అయితే పెంచిన విజయ పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలేనని, వాటి ధరలను పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలకు దూరం అవుతారని చెబుతుంది.
అమూల్ మిల్క్ కూడా అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 15 నుంచి లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లీటర్ పాలకు రూ.3 చొప్పున ధర పెంచుతూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.
పాల రకాలు |
పాకెట్ సైజు | పాత ధర | కొత్త ధర |
డైట్ మిల్క్ | 500 | 18.00 | 19.00 |
డబుల్ టోన్డ్ మిల్క్ | 200 | 8.00 | 8.50 |
డబుల్ టోన్డ్ మిల్క్ | 300 | 11.00 | 12.00 |
డబుల్ టోన్డ్ మిల్క్ | 500 | 19.00 | 20.00 |
ఫ్యామిలీ మిల్క్ | 500 | 20.00 | 21.00 |
టీ స్పెషల్ | 500 | 20.00 | 21.00 |
టోన్డ్ మిల్క్ | 200 | 8.50 | 9.00 |
టోన్డ్ మిల్క్ | 500 | 21.00 | 22.00 |
టోన్డ్ మిల్క్ | 1000 | 42.00 | 44.00 |
టోన్డ్ మిల్క్ | 6000 | 246.00 | 258.00 |
ఆవు పాలు | 500 | 21.00 | 22.00 |