హైదరాబాద్‌లో దారుణం, కరోనా భయంతో అపార్ట్‌మెంట్ నుంచి వృద్ధ దంపతులు గెంటివేత
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు. కాగా ఇప్పటివరకు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకింది. బయటి దేశాలకు వెళ్లిన వారు మాత్రమే కరోనా బారినపడ్డారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిని చూసి భయపడే పరిస్థితి ఉంది. వారికి కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. (వామ్మో, తెలంగాణలో మరో కరోనా కేసు)
ఇలాంటి అనుమానమే హైదరాబాద్ అల్వాల్ లో దారుణానికి దారి తీసింది. కరోనా భయంతో వృద్ధ దంపతులను అపార్ట్ మెంట్ నుంచి గెంటివేశారు. ఆ వృద్ధ దంపతులు మూడు రోజుల క్రితమే విదేశాల నుంచి వచ్చారు. అసలే విదేశాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. పైగా వృద్ధులకు ఈజీగా అటాక్ అవుతుంది. అసలే వృద్ధులు, పైగా విదేశాల నుంచి వచ్చారు. వారికి కూడా కరోనా ఉందేమో అనే భయంతో అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వాళ్లు ఆ వృద్ధ దంపతులను బయటకు గెంటేశారు. ఇప్పడీ ఘటన సంచలనంగా మారింది. ప్రజల్లో ఏ రేంజ్ లో కరోనా భయాలు ఉన్నాయో అద్దం పడుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 7వేల 965మంది చనిపోయారు. అలాగే కరోనా బారిన పడిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. లక్ష 98వేల 178 మందికి కరోనా సోకింది. వారిలో 7వేల 20మందికి సీరియస్ గా ఉంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో ఒక్కసారిగా కరోనా విజృంభించడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలో వుహాన్ లో కరోనా వెలుగు చూసింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ కానీ మందు కానీ కనిపెట్టలేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.