ఓటర్లు @ 2 కోట్ల 95 లక్షలు : ఓటర్ జాబితా రెడీ 

  • Published By: madhu ,Published On : February 21, 2019 / 02:37 PM IST
ఓటర్లు @ 2 కోట్ల 95 లక్షలు : ఓటర్ జాబితా రెడీ 

Updated On : February 21, 2019 / 2:37 PM IST

పార్లమెంట్‌ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఓటరు జాబితా రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 3 కోట్లకు చేరువలో ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. గత డిసెంబర్‌ 25 నుంచి ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణలో ఇప్పటి వరకు 23 లక్షల 71 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు.. ఇటీవల ఎన్నికల అధికారులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో అదనంగా 16 లక్షల 51 వేల ఓట్లు చేరాయి. ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. మొత్తం 2 కోట్ల 95 లక్షల మంది ఓటర్లు ఉంటారని ఈసీ కార్యాలయం చెబుతోంది.

* ఫిబ్రవరి 14 వరకు 23 లక్షల 71 వేల దరఖాస్తులు వస్తే 21 లక్షల 17వేల దరఖాస్తులను ఆమోదించారు. 
* 15 వేల 896 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. 
* రాష్ట్రంలో 32 వేల 594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటికి అదనంగా 2,030 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ ఆమోదం తెలిపింది. 
* ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెరిగిన ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా 34,624 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.