ఆర్టీసీ ఉద్యోగుల త్యాగాలు మరవొద్దు : సీఎం కేసీఆర్ కి పవన్ విన్నపం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. తొందరపడి అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం కేసీఆర్ ని పవన్ కోరారు. సకల జనుల సమ్మె సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకి అండగా ఉన్నారని పవన్ గుర్తు చేశారు. వారి త్యాగాలను మర్చిపోవద్దన్నారు. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు.. సంయమనం పాటించాలని.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామన్నారు జనసేనాని. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరపైనా ఉందన్నారు. ఉద్యోగుల పట్ల ఉదాతర చూపాలని, సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ని పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
”ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మె చేస్తున్న 48వేల 660 మంది ఉద్యోగుల్లో 1200 మందిని తప్ప మిగిలిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజుల పాటు నాడు తెలంగాణ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యగోలు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారు. వారు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి” అని పవన్ ట్వీట్ చేశారు.
ఉద్యోగుల తొలగింపు ఆందోళనకరం – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/mpOubuOA2g
— JanaSena Party (@JanaSenaParty) October 7, 2019