చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 02:25 AM IST
చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

Updated On : March 6, 2019 / 2:25 AM IST

హైదరాబాద్: ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది

హైదరాబాద్: ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది రైతుల  ఖాతాల్లో రూ.2వేలు బదిలీ కానుందని, ఇందుకోసం కేంద్రం రూ.152 కోట్లు కేటాయించిందని తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ పార్థసారథి తెలిపారు. పీఎం కిసాన్ పథకంలో తొలి విడతగా  2019, ఫిబ్రవరి 24న రాష్ట్రంలోని 5.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున(మొత్తం రూ.118కోట్లు) జమ చేశారు.

అర్హులైన రైతుల వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ అధికారులు సెంట్రల్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20.35 లక్షల మంది రైతుల వివరాలను అప్‌లోడ్‌ చేశారు.తొలి  విడత సాయం రూ.2వేల పంపిణీ మార్చి నెలాఖరుకి పూర్తి చేయాలని కేంద్రం లక్యంగా పెట్టుకుంది. మార్చి 31లోపు డేటా అప్‌లోడ్, నగదు బదిలీని పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాలకు ప్రధాని  డెడ్‌లైన్ విధించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నాటికి రెండోసారి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే ఆలోచనలో కేంద్రం  ఉంది.

అన్నదాతలకు అండగా నిలిచేందుకు మోడీ సర్కార్ ”ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి” పథకాన్ని తీసుకొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019, ఫిబ్రవరి 24న ప్రధాని మోడీ ఈ  పథకాన్ని ఆవిష్కరించారు. 12.5 కోట్ల మంది రైతులకు తొలి విడత కింద రూ.2వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. 5ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6వేలు  చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లోనే ప్రతిపాదించింది. 3 విడతల్లో రైతులకు ఈ మొత్తం అందుతుంది. కేంద్రం ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.2వేల చొప్పున మొదటి విడత నగదును  బదిలీ చేయనుంది.

2018 డిసెంబర్ నుంచే రైతులకు కిసాన్ సమ్మాన్ పథకం వర్తిస్తుంది. అందులో భాగంగానే 2019 ఆర్థిక సంవత్సరం చివరికల్లా తొలి విడత కింద ఇవ్వాల్సిన రూ.2వేలు రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది.