నరసాపురం-సికింద్రాబాద్ మధ్య 6 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీని పురస్కరించుకుని నరసాపురం-సికింద్రాబాద్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైళ్లు వయా నల్గోండ, గుంటూరు, వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి. జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ స్పెషల్ రైళ్లు బయలుదేరనున్నాయి. తిరుగు ప్రయాణంలో నరసాపురం నుంచి 18, 19 తేదీల్లో నడవనున్నాయి. సికింద్రాబాద్ లో రైలు బయలుదేరే సమయాల్లో స్వల్ప వ్యత్యాసం ఉంది.
సికింద్రాబాద్ నుంచి
జనవరి10న 82725 నెంబర్‌తో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నల్లగొండ, గుంటూరు మీదుగా ఉదయం 4.30 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
11వ తేదీ సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి గుంటూరు మీదుగా ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
12, 13 తేదీల్లో 07256 నెంబర్‌తో రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
నరసాపురం నుంచి
18వ తేదీన 07255 నెంబర్‌తో నరసాపురంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ గుంటూరు,నల్గోండ మీదుగా హైదరాబాద్ వెళ్లనుంది.
19న నరసాపురంలో రాత్రి 8.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు సికింద రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా వెళ్తుంది.
ఈ ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గురువారం జనవరి2 నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. అన్‌లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చునని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : శుక్రవారం కూడా వర్షాలు