వెదర్ అప్ డేట్ : మరో రెండు రోజులు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు

  • Published By: veegamteam ,Published On : October 4, 2019 / 02:42 AM IST
వెదర్ అప్ డేట్ : మరో రెండు రోజులు వర్షాలు

Updated On : October 4, 2019 / 2:42 AM IST

తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారం పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తర్వాత ఆగాయి. మళ్లీ రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. వాతావరణంలో మార్పులే కారణం అని అధికారులు చెబుతున్నారు. క్యుములో నింబస్ మేఘాలతో క్షణాల్లో కారు మబ్బులు కమ్ముకొని కుండపోత వర్షం కురుస్తోందన్నారు. ఈ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో అవస్థలు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు మళ్లీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. వచ్చే 2 (శుక్రవారం, శనివారం) రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. తమిళనాడు దక్షిణ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని కొన్ని చోట్ల భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. ఏళ్లుగా అరకొరగానే నిండే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కూడా ఈ సారి నిండుకుండలా మారింది. అటు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. బాసర నుంచి మొదలుకొని భద్రాచలం వరకు.. అటు ఏపీలోనూ గోదావరి నది కళకళలాడుతోంది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజుల్లో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. గురువారం (అక్టోబర్ 03,2019) ఏపీలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి. దెందులూరులో 8, మండవల్లిలో 6, చిత్తూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మాదాపూర్‌, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో సాధారణంగా 157.2 మిమి వర్షపాతం కురవాల్సి ఉండగా.. 339.7 మిమి వర్షం కురిసిందని… ఈ వర్షాకాలంలో ఓ నెలలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే అని అధికారులు తెలిపారు.