రోడ్లను కూడా వదల్లేదు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూఅక్రమాలు

రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్‌పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 06:36 AM IST
రోడ్లను కూడా వదల్లేదు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూఅక్రమాలు

Updated On : March 2, 2020 / 6:36 AM IST

రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్‌పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే

రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్‌పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే నిర్దాణకు వస్తున్నారు రెవెన్యూ అధికారులు. గోపన్‌పల్లి సర్వే నెంబర్ 34లో ఎకరా 11 గుంటల భూమిని కబ్జా చేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 126 కోమటికుంటలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎకరా 14 గుంటల్లో పాగా వేశారని అంటున్నారు. యదేచ్ఛగా కబ్జాలతో చెరువులోకి నీళ్లు రాకుండా రేవంత్ అడ్డుకట్ట వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వందేళ్ల నుంచి ఉన్న గోపన్‌ పల్లి రోడ్డునూ రేవంత్ రెడ్డి వదల్లేదని… సర్వే నెంబర్ 127లో బండ్లబాటలోనూ రేవంత్ తిష్టవేసినట్లు అధికారులు తెలిపారు. సర్వే నెం 128, 160ల్లోనూ 10 గుంటల ప్రైవేట్ స్థలాన్ని కబ్జాచేసి రేవంత్ బ్రదర్స్ గేట్లు పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. 

నిబంధనల ఉల్లంఘన:
సర్వే నెంబర్ 127లోనూ ఐదెకరాల 21 గుంటలు కూడా టైటిల్ ఫేక్ అని విచారణలో నిర్ధారించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం, తెలంగాణ రెవెన్యూ ఫస్లీ యాక్ట్ ప్రకారం అన్ని రకాల నిబంధనలను రేవంత్‌ రెడ్డి ఉల్లంఘించినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. రేవంత్ బ్రదర్స్ పై క్రిమినల్ చర్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి బండ్లబాట, చెరువును రక్షించాలంటున్నారు స్థానికులు. 

ఎస్సీ సొసైటీ భూముల ఆక్రమణ:
రాజోల్ ఎస్సీ సొసైటీ భూములను ఆక్రమించారంటూ గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎస్సీ సొసైటీ సభ్యులు. దీంతో ఏ1గా కొండల్ రెడ్డి, ఏ3గా రేవంత్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే… ఎస్సీ సొసైటీ భూములను రేవంత్ బ్రదర్స్‌ నుంచి రక్షించాలంటూ ఆర్డీఓకి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. రాజేందర్‌నగర్‌ ఆర్డీఓ కార్యాలయం భూ బాధితులతో కిటకిటలాడుతోంది. ఆర్డీఓని కలిసిన బాధితులంతా ప్రధానంగా రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి మీదే ఫిర్యాదు చేశారు. వారి అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు. 

రేవంత్‌ రెడ్డి బ్రదర్స్‌పై వస్తున్న ఫిర్యాదులన్నీ పరిశీలించిన తరువాత ఆర్డీఓ నేరుగా గోపన్‌పల్లిలోని వివాదస్పద స్థలాలను పరిశీలించనున్నారు. మరోవైపు ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో… ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.