SI ని నిర్బంధించి చిత్రహింసలు : కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై మరో పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నగదు పట్టివేత కేసులో నోటీసులు ఇచ్చేందుకు సందీప్ రెడ్డి

హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై మరో పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నగదు పట్టివేత కేసులో నోటీసులు ఇచ్చేందుకు సందీప్ రెడ్డి
హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మరో పోలీస్ కేసు నమోదైంది. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఎస్ఐని గదిలో నిర్బంధించి చిత్ర హింసలు పెట్టారనే ఆరోపణలపై ఆయనపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నగదు పట్టివేత కేసులో నోటీసులు ఇచ్చేందుకు సందీప్ రెడ్డి ఇంటికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెళ్లారు. ఆ సమయంలో తమను బంధించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు చిత్రహింసలు పెట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 332, 342, 506 కింద కేసు పెట్టారు.
సందీప్ రెడ్డి.. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎన్నికల సమయంలో డబ్బుతో పట్టుబడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం(ఏప్రిల్ 16, 2019) నోటీసులు ఇచ్చేందుకు బంజారాహిల్స్ ఎస్ఐ.. సందీప్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయనను చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. యూనిఫామ్ లో ఉన్న అధికారిని బెదిరించే ప్రయత్నం చేశారని కొండాపై కేసు నమోదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. ఒక ప్రభుత్వ అధికారితో ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం (ఏప్రిల్ 17,2019) ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ మీడియాకి వెల్లడించనున్నారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు ఎవరిది, ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు అనే ప్రశ్నలకు సందీప్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఏప్రిల్ 10న ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీలో కొండా సందీప్ రెడ్డి దగ్గర రూ.10 లక్షలు పట్టుబడటం రాజకీయంగా దుమారం రేపింది. సందీప్ రెడ్డి.. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థికి బంధువు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేసేందుకే ఈ డబ్బును వినియోగిస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు రూ.1.5 కోట్ల వరకు డబ్బు పంపిణీ చేసినట్లుగా సందీప్ దగ్గర లభించిన పత్రాల ఆధారాంగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విశ్వేశ్వర్ రెడ్డి డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.