సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రమ్యకృష్ణ ఆత్మ హత్య

  • Published By: murthy ,Published On : October 3, 2020 / 01:13 PM IST
సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని రమ్యకృష్ణ ఆత్మ హత్య

Updated On : October 3, 2020 / 1:28 PM IST

Hyderabad Crime News : హైదరబాద్ లో విషాదం జరిగింది. Soft  Ware Company Employee రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జల్లా నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోట్ లక్ష్మీనరసింహ కాలనీలోని సామ్రాట్ అపార్ట్ మెంట్ లో నివసించే రమ్యకృష్ణ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగిని ఆత్మహత్యకు కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు.

ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో లభించిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రమ్యకృష్ణ భర్త గోపి కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తున్నాడని వీరికి ఐదేళ్ల క్రితం వివాహం అయిందని పోలీసులు తెలిపారు. వీరికి కవల పిల్లలు ఉన్నారు.

రమ్యకృష్ణ ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. తమకు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవని….. కుటుంబ కలహాలు లేవని ఆమె భర్త గోపీ పోలీసులకు వివరించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.